మరణ శాసనం లిఖిస్తే... మరణం తప్పదా? - 4

(194)
  • 1.9k
  • 891

ఆనందరావు, " చూడు కార్తీక్! నీ గతం గురించి వినాలనుకుంటున్నాను. ఎందుకో నువ్వు హంతకుడువని, స్వయాన నా బావమరిది కొడుకును చంపావని తెలిసినా నాకు నీ పైన కోపంగాని ద్వేషం గానీ రావడం లేదు. నేను నీకు తండ్రి లాంటి వాడిని. నా కోసమైనా ఏం జరిగిందో చెప్పు" అని బతిమాలుతూ అడిగాడు. కార్తీక్ ఏం చెప్తాడా అని సుమా సత్య కూడా ఎదురు చూడ సాగారు. కార్తీక్ మెల్లగా లేచి నడుచుకుంటూ దగ్గరిలోని కిటికీ వద్దకు వెళ్లి బయటకు చూస్తూ నిలబడ్డాడు. కంటిలో నుండి సన్నగా ధారగా కన్నీళ్లు ఉబికి వచ్చాయి. వాటిని దిగమింగుకొని, గొంతు సవరించుకొని మొదలుపెట్టాడు..."నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి మా ఇంట్లో నేను, అమ్మ, నాన్న మాత్రమే ఉండే వాళ్ళం. మాది చాలా చిన్న ఫ్యామిలీ మరియు సంతోషకరమైన ఫ్యామిలీ. ఎప్పుడూ మా ఇంట్లో అమ్మకు, నాన్నకు ఎలాంటి గొడవలు లేవు. చాలా అన్యోన్యంగా ఉండేవారు.