రెండు నీడలుWRITER BYశ్రీనిహారిక PART 1 THE BEGINScene 1 – Hospital మోర్చ్యువరీ(వర్షం. లైట్లు ఫ్లికర్ అవుతాయి. చిన్నారి శవం. రాఘవ కూర్చున్నాడు).డాక్టర్:క్షమించండి… మేము ప్రయత్నించాం…(డాక్టర్ వెళ్తాడు)రాఘవ నిశ్శబ్దంగా చూస్తుంటాడు.రాఘవ (నిదానంగా):లేవమ్మా… చలి పడుతుంది…నీకు చలికాదు కదా… నాన్న దగ్గరే ఉన్నాడు…(చేతి తాకుతాడు — చల్లగా ఉంటుంది)రాఘవ:ఏమిటి ఇది…?ఎందుకు మంచు లా ఉన్నావ్…?(ఆదిత్య వెనుక నిలబడి ఏడుస్తాడు)ఆదిత్య:నాన్న… వదిలేయ్…రాఘవ (కేక):వదలమంటావా??ఇది బొమ్మ కాదు… నా గుండె!!Scene 2 – House Nightఇల్లు నిశ్శబ్దం.రాఘవ గోడకి ఎదురుగా కూర్చుని మాట్లాడుతున్నాడు.రాఘవ:నువ్వు తిన్నావా అమ్మా…?నేను అన్నం పెట్టా… చూడు…(ఖాళీ ప్లేట్)ఆదిత్య చూస్తూ గడ్డకట్టిపోతాడు.ఆదిత్య:నాన్న… ఆమె లేదు…రాఘవ (నవ్వుతూ):నువ్వే పిచ్చివాడివి…ఆమె ఇక్కడే ఉంది…(గోడ చూపిస్తాడు)రాఘవ:చూడు… నవ్వుతుంది…ఆదిత్య కళ్ళు మూసుకుంటాడు.Scene 3 – Flashback చిల్డహుడ్చిన్నారి నవ్వుతూ పరుగెడుతుంది.చిన్నారి:నాన్న పట్టుకోగలవా??రాఘవ:పట్టుకోలేను… నువ్వు పక్షిలా ఉన్నావ్!(హాస్యం)CUT BACK → రాఘవ ఖాళీ గదిలో ఒంటరిగా.Scene 4 – Terrace Midnightఆదిత్య సిగరెట్.Mirror లో చూస్తాడు.ఆదిత్య:నేను ఏడవకూడదు…నేను పడిపోతే…