మారుతున్న యువతఒకప్పుడు మన ఊళ్లలో ఉదయాన్నే పక్షుల కిలకిలారావాలు, గాలిలో చెట్ల పరిమళం, పొలాల్లో రైతుల శబ్దం — ఇవన్నీ జీవానికి చైతన్యం ఇచ్చేవి.ఇప్పుడు ఆ ప్రాణవాయువులే మాయం అవుతున్నాయి. పక్కింటివాడు ఎవరన్నా తెలుసుకునే సమాజం పోయింది. మనిషి మనిషిని చూసే తలతిప్పే దశ కూడా లేదు.ఈ తరం యువత — భవిష్యత్తు అని పిలవబడిన వారు — నేడు బానిసలుగా మారుతున్నారు.అవును, బానిసలు… కానీ ఎవరికి?ఫ్యాషన్‌కి, టెక్నాలజీకి, చేడు అలవాట్లకు.ఎంత చదువుకున్నా, ఉద్యోగం దొరకట్లేదనే నెపంతో నిరుత్సాహం, దానికితోడు ప్రభుత్వ సహాయాలు అందుతున్నాయనే సౌలభ్యం — ఇవన్నీ కలిపి యువతను సొమ్మసిల్లేలా చేశాయి.చదవకపోయినా సరే, ప్రయత్నించకపోయినా సరే, "ఓకే బాస్! మనకి డబ్బు వస్తుంది!" అనే దోరణి పెరిగిపోయింది.ఇక పని చేయాలనే తపన, ఎదగాలనే ఆతురం – ఇవన్నీ క్రమంగా మాయమవుతున్నాయి.పనిలేకపోవడం కంటే భయంకరం – పనికి ఇష్టంలేకపోవడం.ఇప్పటి యువతలో అదే వ్యాధి పాకుతోంది.నోరు ఉన్నది తినడానికి మాత్రమే, చేతులు