అంతం కాదు - 67

రుద్ర రూపాంతరం: యుద్ధభూమిలో ఆంజనేయుడురుద్రను తన శక్తులతో కాంటాక్ట్ అవుతూ, "సామ్రాట్, నువ్వు ఇక్కడ పని చేయనవసరం లేదు. ఇక్కడ గరుడ వచ్చాడు కాబట్టి, గరుడ ఇక్కడ ఉన్న సైన్యాన్ని మొత్తం చూసుకుంటాడు. నీ బాధ్యత ఇప్పుడు భూమి పైన ఉంది. నీకోసం సైనికులు కూడా ఉన్నారు కాబట్టి యుద్ధానికి సిద్ధం కా!" అని అంటూనే తన శక్తిని అక్కడే ఉండి, ఎక్కడో ఉన్న సామ్రాట్‌ను మాయం చేస్తాడు. అప్పుడే అందరికీ అర్థం అవుతుంది. రుద్ర దిగితే ఆట మరింత రసవంతరంగా మారుతుంది అని అనుకుంటూనే మిగతా వాళ్ళు యుద్ధం చేయడం మొదలుపెట్టారు.సామ్రాట్ ప్లేస్‌లోకి ఇప్పుడు గరుడ ముందుకు వచ్చాడు. అతను పక్షి రూపం నుంచి మానవుడిగా మారి, తన గరుడ పక్షుల బలమైన రెక్కలతో, రెక్కల కింద చేతులతో, చేతుల్లో ఆయుధంతో, నల్లటి కవచం లాంటిది తన పొట్టు చుట్టూ తగిలించుకొని, కింద కూడా ఒక చిన్న సంచి లాంటి