మట్టిలో మాణిక్యం నిజ జీవిత కథ సిరీస్ - 7

ఇసుకలో ట్రాక్టర్ నడిపే అతను..అక్క ఒక్కతే ట్రాక్టర్ లో పేసిన మట్టి రోడ్డు మీద పోయటానికి వెళ్లినపుడు. అతను ఇలా అన్నాడంట.."నువు నాకు నచ్చావ్..నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అనిఅక్కకు భయం తో ఏం చేయలో తెలియలేదు...అమ్మ నాన్న కు చెబితే గొడవ అవుతుంది అని..అక్క మా అక్కకు , అన్నలకు చెప్పిందిదానితో మా అన్న గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు అతనికి...అతను  మా అన్నను చూసి బయపడిపోయాడు.దానికి మా అన్న ఏదో సాధించినట్టు తెగ సంతోష పడుతున్నాడు.ఏదేమైనా మాకు వచ్చిన ప్రాబ్లంను అమ్మ నాన్న కు తెలియకుండా మేమే పరిష్కరించుకున్నాము.ఇలా కొన్ని రోజులు గడిచినా తరువాత నా 4వ తరగతి కూడా అదే వూరిలో గడిచిపోయింది. ఎండాకాలం సెలవులలో అమ్మ వాళ్ళతో..పనికి వెళ్ళేది.అదే వూరిలో  పొలాల దగ్గర వుండే బావి  మట్టి తెచ్చి గంగలో పోసేవారు.ఆ పల్లెటూరిలో బావి దగ్గర వాతావరణం చాలా బాగుండేది.ఎండాకాలం టైం కాబట్టి ముంజకాయలను తినడం...గంగలో నీళ్లు తక్కువగా