సరయు

అర్జున్ అతని కార్ లో, తన భార్య (అనిత) మరియు అయదు సంవత్సరాల కొడుకు ( సుహాస్) తో కలసి వికారాబాద్ లో వీకెండ్ గడపడానికి వెళ్తున్నాడు. Fm లో పాటలు వస్తుంటే.. అర్జున్ Fm ని ఆపి తన ప్లే లిస్ట్ లోని ఇళయరాజా సాంగ్స్ పెట్టాడు.అనిత అసహనంగా చూస్తూ " Fm లో పాటలు బాగానే ఉన్నాయ్ కదా" అని అంటుంది మూతి ముడుచుకుని.." సాంగ్స్ తో పాటు యాడ్స్ కూడా బాగానే ఉంటాయి, అయినా నీ సోదే భరించడం కష్టం మధ్యలో ఇవి కూడానా " అని కొంటెగా అంటాడు అర్జున్.."ఏంటి నాది సోదా" అని కోపం నటిస్తూ అతని బుజం పై కొడుతుంటుంది అనిత. ఇంతలో ఇద్దరి మధ్యలోకి సుహాస్ వచ్చి "మామ్... డాడ్... Please స్టాప్, మీ సోది వల్ల నేను Doreman చూడలేక పోతున్న" అని అనే సరికి ఇద్దరు గొడవ పడడం ఆపేసి