నిజం - 1

సాగర తీరానికి ఆనుకొని ఉన్న నగరం విశాఖపట్టణం. ఆ నగరం లోని గాజువాక లొ ఓ ఇంటి మేడ పై ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటున్నారు.  అబ్బాయి పేరు సురేష్ వయసు 34 ఏళ్ళు వైజాగ్ కోకా కోలా (Coca cola Vizag) కంపెనీలొ చార్టెడ్ అకౌంటెట్ (CA) గా పని చేస్తున్నాడు.అమ్మాయి పేరు భవ్య వయసు 28 ఏళ్ళు వైజాగ్ లోని బుల్లయ్య కాలేజి లొ కెమిష్ట్రి లెక్చరర్ (Chemistry lecturer) గా పని చేస్తుంది.అక్కడ వీళ్ళిద్దరికి పెళ్ళి చూపులు జరుగుతున్నాయి. కాసేపటికి మైడ పై నుంచి వీళ్ళు క్రింద కి వచ్చి అక్కడ ఉన్న వీళ్ళ పెద్దవాళ్ళకి తమ అభిప్రాయాన్నీ తెలిపారు.రాము (సురేష్ తండ్రి) : మీ అమ్మయి మా అబ్బాయి తొ సహా మా అందరికి నచ్చింది. మరీ మీ మీ అభిప్రాయాలు ఏంటి.?శేషాచలం (భవ్య తండ్రి) : మరోలా అనుకోకండి ఎంతైన ఆడపిల్ల తండ్రిని కదా వెంటనె