మట్టిలో మాణిక్యం నిజ జీవిత కథ సిరీస్ - 6

  • 33

మన నాలుగో బాబాయ్‌కి పెళ్లి కుదరడంతో  అందరం పెళ్లి పనుల్లో చాలా బిజీ అయ్యాము.మా బాబాయ్ కి పెళ్లి అనేసరికి మా కళ్ళలో ఎక్కడలేని సంతోషం ..మంచిగా ఆడుకోవచ్చు..సరదాగా అందరితో గడపవచ్చు అని మేము చాలా సంతోష పడినాము. మా కుటుంబం లో మాకు ఒక సంప్రదాయం వుంది.అది ఎప్పటినుంచో ఆచారంగా వస్తోంది.పెళ్లి కొడుకును లేదా...పెళ్లి కూతురును చేసే రోజు మేము మా కుల దైవం అయిన ఎల్లమ్మ తల్లికి సత్తాన బోనం చేయడం అలవాటు.పెళ్లి కొడుకును చేసే రోజు ఇంటి పెద్ద లేదా ..పెళ్లి కొడుకు  తల్లి  ఆ రోజు ఒకపొద్దు వుండి..ఒక కుండలో ఎల్లమ్మ తల్లికి బోనం వండాలి.వండిన బోనం చల్లారిన తరువాత ఒక కొత్త సాప వేసి దాని మీద కొన్ని బీయ్యం పోయాలి..తరువాత  దాని మీద బోనం పెట్టాలి బోనం పెట్టిన తరువాత పెళ్లి కొడుకు లేదా పెళ్లి కూతురు పెళ్లి బట్టలు అన్ని తెచ్చి ఆ బోనం మీద