అంతం కాదు - 61

సత్యయుగ గ్రహం: కల్కి కోసం శిక్షణఇక అక్కడ కట్ చేస్తే, మళ్ళీ హీరోల వైపు చూపిస్తారు. హీరోలు అందరూ ఒక చోట నిలబడి ఉంటే, వాళ్ళందరూ యుద్ధం గురించి ఆలోచిస్తున్నారు. అప్పుడే హనుమంతుడు చిన్నగా నవ్వుతూ, "ఇది మాహిష్మతి సామ్రాజ్యం కాదు. ఇందులో రాజులు లేరు, రాణులు లేరు. ఇది ప్రపంచం. ఈ ప్రపంచాన్ని ఏలగలిగేది కేవలం కృష్ణుడు మాత్రమే. కాబట్టి మీరు అంత తీవ్రమైన ఆలోచన చేయకండి. ఆ కృష్ణుడు తలచినట్టే యుద్ధం జరుగుతుంది. మీరు ఎలా తలిస్తే అలా జరగదు. కాబట్టి మీ సైన్యాలకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టండి," అని హెచ్చరించాడు. "మొత్తం అందరిని ఒక చోటికి చేర్చండి," అన్నాడు.వెంటనే అక్కడికి వచ్చిన అశ్విని హనుమంతుడితో, "శుభోదయం! ఈ సైన్యాన్ని మొత్తం మా సత్యయుగ గ్రహంలో ఈ శిక్షణ ఇవ్వగలిగితే మంచిది ఏమో కదా? అక్కడ కూడా చాలా విచిత్రమైన సన్నివేశాలు చూడవచ్చు. అలాగే ఇక్కడ ఉన్న సైనికులు