మట్టిలో మాణిక్యం నిజ జీవిత కథ సిరీస్ - 5

అమ్మతో తో గొడవ చేసిన నాన్న మాత్రం... అక్క ను నన్ను మాత్రం ఏం అనేవాడు కాడు.కానీ అమ్మ కళ్ళ నుంచి వచ్చే కన్నిలను చూసి మా కళ్లలో కన్నీలు వచ్చేవి.తెలిసి తెలియని వయసులో అమ్మ ను ఎలా ఓదార్చాలో తేల్చేది కాదు.కానీ అమ్మ,నాన్న గొడవ తరువాత త్వరగానే కలిసిపోయి మాట్లాడుకునే వారు.ఇటు పక్కనా మూడో తరగతి చదువు సాఫీగా సాగిపోయింది. ఎండాకాలం హాలిడేస్ కూడా వచ్చాయి.ఎండాకాలం అన్ని రోజులు అమ్మ వాళ్ళతో సంతోషంగా ఆడుతూ పాడుతూ పనికి వెళ్ళేది.మా పెద్దమ్మ కొడుకు మా అన్న ఒక డీవీడీ ప్లేయర్ కొనుక్కొని వచ్చి మేము వున్న ఇంట్లో పెట్టాడు..ప్రతి రోజూ మా అన్న పెట్టే పాటలతోనే మేము నిద్ర లేచే వాళ్ళము.మా అందరికి పాటలు అంటే చాలా ఇష్టం వుండేవి.ఎక్కువగా మేము అక్కడ బంగారం,జై చిరంజీవ , లక్ష్మి మూవీ సాంగ్స్ వింటూ కాలక్షేమం చేసేవాళ్ళము. నేను మాత్రము ఇలా ఎంజాయ్ చేస్తూ వుంటే