అంతం కాదు - 60

యుద్ధభూమిలో శపథం - శకుని కుట్ర శకుని, రుద్రను వదిలి వెళ్తున్నప్పుడు, అదే ప్రదేశం – ఎక్కడైతే మహాభారత సంగ్రామం జరిగిందో – అది ఇప్పుడు యుద్ధభూమిగా మారిందని ఒక పెద్ద శబ్దం వినిపించింది. "ఆ యుద్ధంలో ఈ రుద్ర గాని ప్రాణం లేని శవంలా నిలబెట్టి నేనంటే ఏంటో చూపిస్తాను!" అని శకుని గట్టిగా శపథం చేశాడు. అదంతా చూస్తూన్న రుద్ర, చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుంచి మాయమైపోయాడు.రుద్ర, శకుని మధ్య సంభాషణ జరుగుతున్న సమయంలోనే, హీరోలు ఉన్న ప్రదేశంలో అశ్వద్ధామ మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. "చూడండి, ఇప్పుడు రుద్ర వెళ్ళాడు. ఏదో ఒక గందరగోళం చేస్తాడు. వాడు మన అందరిపై ఎక్కువ దృష్టి పెట్టకుండా రుద్రపై ఎక్కువ దృష్టి పడేలా చేస్తాడు. కాబట్టి మీ సైన్యం ఏంటి, మీ శక్తి ఏంటి, మీ బలాలు ఏంటి – అన్ని ఒక గంటలో నాకు తెలియాలి. ఇప్పుడు నేను యుద్ధరంగానికి తగినట్టుగా ఒక