అంతం కాదు - 59

హనుమంతుడు నవ్వి, "అవును, నీకంటే ఎక్కువ తెలుసు. వాడు మన గురించి ఎక్కువగా ఆలోచిస్తూ యుద్ధం మీద దృష్టి పెట్టకపోవడం లేదా దేని మీదైనా కొంచెం అదుపు అప్డేట్ చేస్తే చాలు, మనం యుద్ధంలో చాలా సులువుగా గెలవచ్చు. అమ్మాయిలు, మీరందరూ ఒక మంచి పాట నేర్చుకోండి," అన్నాడు. వాళ్ళందరూ విచిత్రంగా చూస్తూ ఉంటే, రుద్ర మళ్ళీ ఒక చిటికి వేస్తాడు. వెంటనే అశ్వద్ధామ, హనుమంతుడు, పరశురాముడు, రుద్ర అందరూ ఒక్కసారిగా మాయమైపోతారు.శకుని వ్యూహం, రుద్ర ఆగ్రహంసీన్ కట్ చేస్తే, అది ఒక నల్లటి భవనం. చుట్టూ నెగటివ్ ఎనర్జీ మామూలుగా కనిపించడం లేదు. లోపల ఒక వ్యక్తి హైటెక్ సూట్ వేసుకొని కూర్చుని ఉన్నాడు. అప్పుడే భైరవ ఎగురుతూ వచ్చి దెబ్బలతో కనిపించాడు. "ఏమైంది భైరవ? నిన్ను అంతగా కొట్టారా?" అని అడిగాడు ఆ వ్యక్తి. "కొట్టారు కాదు ప్రభు, కొట్టాడు!" అన్నాడు భైరవ. "ఎవరు?" అనగానే భైరవ మాట్లాడుతూ,