ఇప్పుడు నారదుడిని చూస్తూ 'అమ్మో నారదా, ఇప్పుడు నా కొంపకి నిప్పంటావు కదా అయ్యా!' అని అనుకుంటూ 'అమ్మ చెప్పేది వినండి' అని అంటున్నాడు. తన భార్య కూడా గట్టిగా ఏడుస్తూ 'అమ్మ, నాన్న' అని అరుస్తుంది. అక్కడికి యమపురి రాణి యొక్క అమ్మా నాన్నలు వస్తారు. 'ఏమైంది అమ్మ? ఎందుకు ఏడుస్తున్నావ్?' అని అంటాడు. 'చూడండి, మీరేమో పెళ్లి చేశారు, ఇప్పుడు నాకు ఇష్టం లేనట్టుగా నా కూతురికి వేరే వాళ్ళతో పెళ్లి చేయాలని చూస్తున్నాడు మీ అల్లుడు. ఏం చేస్తారో నాకు తెలియదు. నా కూతురికి ఇష్టం వచ్చినట్టు చేయాలి. ఈ ప్రయత్నం చేయకపోతే మీ అందరినీ నేను బ్రహ్మదేవుడు దగ్గరికి చేరుస్తాను. ఆయన చెప్తాడు ఏం చేయాలో' అని భయపెట్టడం మొదలుపెట్టింది. 'అమ్మో అమ్మో, ఇది ఎక్కడిది రా మామ? ఇప్పుడు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తారా? వద్దులే ఆగండి! ఒక చిన్న ప్రశ్న, మీరు చెప్పినట్టే చేస్తా'