వర్షం పడిన మరుసటి రోజు...తెల్లవారు జామున మబ్బులను దాటుకొని సూర్యడు ఎరుపు వర్ణం లో వస్తున్నాడు..సూర్యుడి వెలుతురుకి పక్షులు వాటి గూటి నుంచి బయటి వచ్చి సూర్యునికి ఎదురుగా ఎగురుకుంటూ పోతున్నాయి..వర్షం పడడం తో ఈ ప్రాంతం అంత మట్టి వాసనతో నిండిపోయింది.ఇన్ని రోజులు వర్షానికి... నీటి తాకిడికి దూరమైన చెట్లు అన్ని వర్షం నీటి తో ఊపిరి పీల్చుకున్నాయి.ఊరిలోని జనం అంతా తెల్లవారు జామునే నిద్ర లేచి ...వారి ఇంటి పనులు చక్క పెట్టుతున్నారు.ఉదయం 8 గంటలు కాగానే అందరు...విత్తనాలతో చెలకల లోనికి బయలు దేరారు.నా చుట్టుపక్కల చెలకాలో కొందరు పత్తిని,కొందరు మొక్కజొన్నాను వేస్తున్నారు.ఇన్ని రోజులు జనం అంత వూరిలో కనిపించే వారు కానీ ఇప్పుడూ జనం అంతా చేలకాలో కనిపిస్తున్నారు.ప్రతి ఒక చెలకలొ మనషులు కనిపిస్తున్నారు...ఈ దృశ్యం చూడటానికి "భూమి తల్లి "జాతర గా చెప్పుకోవచ్చు.మా రాము వాళ్ళు కూడా నాకు కొంచం దూరం లో పత్తి గింజలు