మట్టిలో మాణిక్యం నిజ జీవిత కథ సిరీస్ - 3

నా చేతులుంచి ఫోన్ కింద పడగానే నాన్న నా దగ్గరకు వచ్చారు.వచ్చి నన్ను కొట్టబోయాడు..ఇంతలో అమ్మ వచ్చి ..."అనుకోకుండా పడిపోయింది ఏం అన్నాకు" అని నాన్న కు చెప్పింది.నాన్న ఎత్తిన చేయిదించి  ఫోన్ తీసుకొని వెళ్ళిపోయాడు.నేను ఏడుస్తూ మూలకు కూర్చున్నాను.తరువాత అమ్మ వచ్చి నన్ను బుజ్జాగించింది.నాన్న ఆ ఫోన్ తీసుకొని షాప్ కి వెళ్లి మళ్ళీ వేరే కొత్త ఫోన్ తెచ్చాడు.ఈసారీ నాన్న నాకు అసలు ఫోన్ ఇవ్వలేదు.నేను కూడా అడగలేదు ఇకా..ఇలా కొన్ని రోజులు గడిసిన  తర్వాత నాన్న పని చేసే  ఒక  సారు ద్వారా ఒక పెద్ద పని వచ్చింది.ఈ పని వల్లనా మా జీవితాలే మారిపోయాయి.ఆ పని కోసం అమ్మనాన్న పని జరిగే వేరే వూరికి వెళ్లాల్సి వచ్చింది.మమ్మల్ని తీసుకొని వెళ్తే మా చదువు పాడవుతుంది అని..పక్కన  ఉన్న గుడిసెల వాళ్లకు చెప్పి,అమ్మ–నాన్న ఇంకా మిగతా వాళ్లు కలిసి ..మొత్తం పదిమంది దాకా అక్కడికి వెళ్లారు.అక్కడికి వెళ్లి