మొక్కజొన్న చేను తో ముచ్చట్లు - 23

మా రాము నాకు నీళ్లు కడుతున్న సమయం లో .. నా వెనుక నుంచి ఏదో గజ్జల శబ్దం వినిపిస్తుంది.నేను వెనుకకు తిరిగి చూసాను .. నా వెనుక నుంచి ఒక 3 ఏళ్ల పాప నవ్వుకుంటూ ..వెనుక వస్తున్న వాళ్ళ అన్నయ్య కు దొరక కుండా పరుగెత్తుకుంటూ వస్తుంది."ఆగు చెల్లె "అంటూ వాళ్ళ 6 ఏళ్ల అన్న తన వెనుకే వస్తున్నాడు.ఆ పాప తనకు దొరకకుండా  రాము దగ్గరికి పరిగెత్తుకుంటూ  వచ్చింది.ఆ పాప చూడటనికి చాలా అందంగా ఉంది. "చిన్నచిన్న కనులు , గుండ్రటి మొఖము ..నల్లటి కురులతో .."ముద్దుగుమ్మలా ఉంది.ఆ పిల్లలు "డాడీ" అంటూ రాము దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు.అప్పటికే సమయం సాయత్రం 4 గంటలు అవుతుంది.కానీ ఎండ ఇంక బాగానే కొడుతుంది."ఇంత ఎండలో ఎందుకు బయటికి వచ్చారు మిమ్మల్ని ఇంటి దగ్గర ఉండమని చెప్పాను కదా" అని రాము వాళ్ళని బెదిరించాడు."అమ్మ పిలుస్తుంటే ఆగకుండా చెల్లి పరిగెత్తుకుంటూ