అంతం కాదు - 48

  • 108

అంటే మీకు ఎలా చెప్పాలి? ఇప్పుడు కాదు, చెప్తా. పదండి," అంటూ అర్జున్ ముందుకు వెళ్ళాడు. కానీ అతను చాలా కష్టపడుతున్నాడు. అతని భుజంపై ఉన్న పిల్లి కూడా ఆ నెగటివ్ ఎనర్జీని పీల్చుకుంటున్నట్లు తల అర్జున్ మెడ వైపు తిప్పుకుంటూ ఉంది. ఈ పిల్లి ఎప్పుడు వచ్చింది అంటే, వాళ్ళు ఆ గ్రహం మీద ల్యాండ్ అయినప్పుడే తనలో నుంచి బయటికి వచ్చింది."ఇది ఎప్పుడు వచ్చిందిరా?" అని విక్రమ్, వీర అడిగారు."వచ్చిందిలే! మీకెందుకు?" అర్జున్ చిరాకుగా అన్నాడు.అర్జున్ మెడ మీద నుంచి ఆ పిల్లి దిగడం లేదు. అందరూ అతన్ని గమనించారు కానీ అది ఎందుకు, ఎలా వచ్చిందో ఎవరికి అర్థం కాలేదు.ప్రదేశం: మనోహర గ్రహం లోపల, టవర్ సమీపంలోసరే అని అలా ముందుకు వెళుతూ ఉండగా, దూరంగా ఒక టవర్ కనబడింది. ఆ టవర్‌లో ఏదో వెలుగుతోంది. చుట్టూ వందల కొలది రాక్షస సేన ఉంది. ఆ రాక్షసులలో