మా మంచి అన్నయ్య

ముక్కు దూలం మీద చాలా గట్టిగా తగిలిందేమో రక్తం బోట బొటాఇంకా కారుతోంది చేతి రుమాలుని అడ్డం పెట్టుకుని కూర్చున్నాడు చైతన్య హాస్పిటల్ ఎమర్జన్సీబెడ్ మీద.“కిరణ్ ‘వాడ్ని ఫ్రెండ్స్ కి అప్పచెప్పి ఫ్లాట్ కి వెళ్లి మళ్లీ వస్తా అక్కడ రవిగాడు ఏంచేస్తున్నాడో చూడాలి మీరు జాగర్తగా చూడండి వీడ్ని మానాన్నకి తెలుస్తే పెద్ద గొడవ అవుతుంది అన్నాడు .వాళ్లు సరే అని తల ఊపారే కానీ మనసులో భయం ఎక్కడ పోలీసులు వస్తారో అని అసలే డిగ్రీ ఫైనల్ఇయర్ కొద్దిరోజుల్లోపరీక్షలుమొదలు అవుతాయి,ఇంట్లో వాళ్లకి కాలేజీ ప్రిన్సిపల్ కి తెలుస్తే అనే బెంగ మొదలుయ్యింది.అయినా చైతన్యని జాగ్రతగా చూడాలి అనుకున్నారు.వాళ్ల అమ్మకి నాన్నకి నేను ఫోన్ చేస్తాను మీరేమీ భయపడకండి అంటూ కిరణ్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు.. దెబ్బ ఎలతగిలింది ఏమర్జన్సీ వార్డులో ఉన్న డ్యూటీ ‘డాక్టర్’ అడిగాడు చైతన్యని దెబ్బ తగిలి రక్తం కారుతున్న ముక్కుని పరీక్షిస్తూ…మందు ‘పార్టీలో ‘ ఫ్రెండ్స్ మధ్య