మట్టిలో మాణిక్యం నిజ జీవిత కథ సిరీస్ - 2

ఈ కథ రాయడానికి ముఖ్య ఉద్దేశం. గొప్ప గొప్ప వారి జీవిత చరిత్రలు తెలుసుకోవడం కాకుండా వెనుకబడిన వర్గాల వారి జీవిత చరిత్ర తెలుసుకొని వారి  జీవన విధానం ఎలా ఉంది .వారు పడిన బాధలు ఎలా ఉన్నాయి. వారు వారి జీవితంలో వచ్చే ఆటుపోటులను అడ్డుకొని ఎలా నిలబడ్డారు. అని అందరికీ తెలియడం కోసమే ఈ మట్టిలో మాణిక్యం కదా రాస్తున్నాను.భాగం 1 తరువాత, అమ్మానాన్న దగ్గర నుంచే మేము పేకాట ఆడడం నేర్చుకున్నాము. అందరి దృష్టిలో అది ఒక వ్యసనం లాంటి ఆట కానీ మాకు మాత్రం అది ఒక కాలక్షేపం కోసం ఆడే ఆట మాత్రమే. పని లేని టైం లో గుడిసెల  వుండే మిగితా వారు డబ్బులు పెట్టీ పేకాట ఆడేవారు . ఇక్కడ వున్న వారు అందరు వారి వయసు తో సంబంధం లేకుండా అందరూ ఆడే వారు.ఈ ఆట అమ్మ వాళ్ళ దగ్గరి నుంచి నేర్చుకున్నాం. కానీ నాన్నకు