Part - 5పునఃపరిశీలన (Re-Investigation)ముంబయి నగరం లొని ధనవంతులు మరియు పెద్ద పెద్ద కార్పోరేట్ సంస్థల కార్యాలయాలు ఉండె ప్రాంతాలలొ సముద్రతీరం వద్ద ఉన్న కఫ్ పరేడ్ (Cuff parade) ప్రాంతం ఒకటి. అక్కడ ఒక పెద్ద కార్పొరేట్ భవనం లోని 20 వ అంతస్తులొ ఉన్న ఆఫీసు. అక్కడ టీ.వీ లొ మీరా హత్య కు సంబందించిన వార్తను తెలుగు న్యూస్ చానెల్ లొ చూపిస్తున్నారు. " వార్తా వ్యాఖ్యాత (News Anchor) : 2 నెలలు క్రితం విశాఖపట్టణం, రుషికొండ ప్రాంతంలోని సీ-వ్యూ అపార్టమెంట్సు లొ జరిగిన మీరా హత్య కేసు లొ ఇప్పుడు మరొ కొత్త మలుపు. మీరా చనిపోయిన తరువాత తన తల్లిదండ్రులు తమ సొంత ఊరు బొబ్బిలి కి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు చనిపోయారు. మీరా హత్య తాలుకు పునఃపరిశీలన కోసం పోలీసులు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం (special team) వాళ్ళు మీరా తల్లిదండ్రుల యొక్క