మొక్కజొన్న చేను తో ముచ్చట్లు - 2

మొక్కజొన్న విత్తనం  వేసిన 7 వ రోజు ..ఉదయం 5 గంటలు అవుతుంది..అప్పుడే కొంచం కొంచం గా తెల్లవారుతుంది ..ఇది ఎండాకాలం "రోణి తిధి" చివరి రోజులు కాబట్టి కొంచెం కొంచెంగా  మసగా మాసగా అయిదు గంటలకే తెల్లవారుతుంది. కొంచెం కొంచెంగా  ఇప్పుడే నేను పైకి వస్తున్నా.. మొన్న 3 రోజుల కిందట  రాము కట్టిన నీటి తడి నాకు సరిపోయింది .అది నేను పెరగడానికి ఉపయోగపడింది. "నేను మట్టిలోంచి బయటికి రావాలని చూస్తుంటే"..'నువ్వు ఎలా వస్తావో నేను చూస్తాను అంటూ' నా పైన ఉన్న ఒక మట్టి పెడ్డ నన్ను అపాలని చూసింది. కానీ నేను ఊరుకుంటానా! తనను రెండు ముక్కలుగా  చేస్తూ మరి.. బయటికి వచ్చాను. బయటికి వచ్చి చూస్తే ..చుట్టూ ఎవరూ లేరు. అన్ని విత్తనం వేయడం కోసం రెడీగా ఉన్నా చెలకలు కనిపిస్తున్నాయి.కొంచెం దూరంలో ఇల్లులు ఉన్నాయి .నా వెనుక భాగం లో వూరు వుంది . నా కుడి