ఇది ఒక సాధారణ కుటుంబం లో పుట్టిన అమ్మాయి నిజ జీవిత కథ .. నా పేరు మీనాక్షి.నేను ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను.మధ్యతరగతి అంటే… ఒక రోజు పని చేస్తే కడుపు నిండుతుంది, కానీ భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఒక భయం వెంటాడుతూనే ఉంటుంది.మా నాన్న సాధారణమైన కూలి.ఎండలోనూ, వానలోనూ కష్టపడుతూ మా కుటుంబాన్ని నిలబెట్టాడు.అతని చెమట చుక్కలే మా జీవితానికి బతుకు దెరువు.మా నాన్న కష్టపడే స్వభావం నాకు ఎప్పుడూ గర్వకారణం.మా అమ్మ ఒక అద్భుతమైన గృహిణి.అలాగే నాన్న తో కూలి పనికీ వెళ్ళేది, కానీ ఇంట్లో మమ్మల్ని చూసుకోవడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు.మా ఇంటి అల్లరి, సంతోషం, కష్టాలన్నింటికీ ఆమె ఒక పెద్ద ఆధారం.మా నాన్న ఒక పట్టణంలో పుట్టి పెరిగాడు.మా తాతయ్య, నాయనమ్మలకు పెద్దగా ఆస్తులు లేవు.అందుకే చిన్నప్పటి నుంచే కష్టాలు ఎదుర్కొన్నారు.మా నాన్నకి ఐదుగురు అన్నదమ్ములు.ఆ ఐదుగురిలో ఆయన రెండవ వాడు.చిన్న వయసులోనే ఒక కిరాణా