Part-XIIIకళింగ మహారాజు ఇంద్రవర్మ వీరఘాతకుడిని చంపడానికి 8 రోజులు ముందు వీరఘాతకుడు రాజ్య పర్యటనికి అని చెప్పి దంతపురం నుంచి బయలుదేరుతాడు. అలా ఒక రోజు ప్రయాణం తరువాత కళింగ రాజ్యం సరిహద్దుకి చేరుకుంటాడు. అక్కడ తన గుఱ్ఱాన్నీ ఒక చెట్టు కి కట్టి కాలి నడకన కొంత దూరం అడివిలోకి ప్రయాణిస్తాడు. అలా ఒక చోట ఆగి అక్కడె ఉన్న ఒక గుహ లోకి వెళతాడు. గుహలోకి కొంత దూరం నడిచాకా. ఒక చోట ఆగి నించుంటాడు.వీరఘాతక : మీరన్నట్టె చేసాను గురువుగారు.అని తన ఎదురు గా కూర్చున్న ఒక సిద్ద సాధువు ని చూసి అంటాడు. అతనె వీరఘాతకుడి కి హిమాలయాల్లొ విద్య నేర్పిన గురువు. వీరఘాతకుడి కి మరణం రాబోతున్నదని ముందుగానె గ్రహించి. అది తనకి వివరించడానికి అని వచ్చాడు. నిజానికి వీరఘాతకుడు తండ్రి పేరు విచిత్ర వర్మ. అతను మరెవరొ కాదు కళింగ రాజ్య మహారాజు ఇంద్ర వర్మ కు తోడబుట్టిన