Part-XII(SIT)ధనుంజయ్ తాను మహేంద్ర వర్మ మనిషి అని వంశి కి తెలియగానె. వెంటనె వంశి తొ పాటు తన నాన్న మరియు పెద్దనాన్న ఉన్న గది తలుపు మూసి తాళం వేస్తాడు.అక్కడ ఉన్న మిగిలిన పోలీసు అధికారులంతా కూడా (SIT)ధనుంజయ్ మనుషులె. వాళ్ళంతా కూడా (SIT)ధనుంజయ్ తొ పాటు వెళ్ళిపోతారు.వంశి : ఇలా జరిగిందేంటి? ఇదంతా నేను నమ్మలేకపోతున్నా.గురుమూర్తి : నమ్మితిరాలి వంశి. ఇదే కాదు. నీకు తెలియని ఇంకొ నిజం కూడా ఉంది. వంశి : ఏంటి ఆ నిజం?నారాయణమూర్తి : ఇప్పటి వరకు జరిగిన ఈ దర్యాప్తు (Investigation) అంతా కూడా డమ్మీ దర్యాప్తు. ఇది ప్రభుత్వానికి తెలియకుండా జరిపించారు.వంశి : ఏంటి?గురుమూర్తి : అవును అసలు ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం (Special Investigation Team) ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం కాదు.వంశి : మరీ ? ప్రభుత్వానికి కాకుండా ఇంక ఎవరికి ఉంది ఆ అధికారం.?నారాయణమూర్తి :