అంతం కాదు - 35

భైరవ ఆ నెగటివ్ ఎనర్జీ ద్వారా మాయమై మరో చోట తేలతాడు. అప్పటికే పూజకు సిద్ధమైన శకుని, పూజలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ అగ్నిగుండం నుంచి వచ్చిన వెలుగు అతని ముఖాన్ని చూపిస్తుంది. ముసలి ముఖం, కంటి దగ్గర ఒక దెబ్బ, మొహంలో క్రూరత్వం, కానీ తెలివైనవాడి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.అతను తన ముఖాన్ని చూసుకుంటూ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తాడు.కురుక్షేత్ర యుద్ధం: ఫ్లాష్‌బ్యాక్కురుక్షేత్ర యుద్ధం ముగియడానికి ఒక్క రోజు ముందు, శకుని తన కాలాన్ని చూసుకుంటూ ఉంటాడు. "ఈ బాధలు పడిన తర్వాతే నేను ఒక తెలివైన యోధుడిలా మారాను. నా వాళ్ల కోసం పగ తీర్చుకోవడానికి నా కుటుంబం ఇచ్చిన ఈ బహుమతిని ప్రపంచానికి అందించే సమయం వస్తుంది. ఆ సమయంలో భూమిని అల్లకల్లోలం చేస్తా. కృష్ణుడు కాదు, శివుడు కాదు, బ్రహ్మదేవులను ఎదిరించే శక్తి నాలో ఉంటుంది. ఇది కచ్చితంగా తెలుసు" అని అనుకుంటాడు శకుని.అలా ఆలోచిస్తూ ఉండగా,