ఇంకా ఆ ఆత్మ అనుకుంటూ ఈ దేవుళ్ళ వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది కానీ నాలాంటి ఒక అసురుడు వల్ల నాకు కనీసం ఇదేనా దక్కింది ఈ ధర్మ నన్ను ఎప్పుడు ఒక బ్రతికున్న మనిషిలా చేసి నా శక్తులతో ఈ ప్రపంచాన్ని ఏలాలో అని అనుకుంటున్నాడు. అతనికి చేయాల్సిన పని గుర్తుకొస్తుంది వెంటనే గట్టిగా అరుస్తాడు కెమెరా బ్యాక్ సైడ్ కి తిరుగుతుంది అతను వెనక్కి తిరిగి మాట్లాడడం మొదలు పెడతాడు అక్కడికి కొంతమంది సైనికులు వచ్చారు వాళ్ళ కళ్ళు నల్లగా చేతి గోర్లు ఎర్రగా శరీరమంతా నలుపు రంగులో విచిత్రంగా కనిపిస్తూ భయానకంగా ఉన్నారు వాళ్ళ నోటి నుంచి కొన్ని రకాల దంతాలు బయటకు వచ్చాయి వాళ్ళు చూడ్డానికి ఒక రాక్షసుడు కనిపిస్తున్నారు వాళ్లకి కూడా శరీరం ఉన్నట్టు అనిపించడం లేదు వాళ్ళు మాట్లాడుతూ ఉండగా అక్కడి నుంచి భైరవ అనే వ్యక్తి వాళ్ళందరిని తోసుకుంటూ ముందుకు