Part - 2గతం (Flash back)ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఓ ఇంటి తలుపు కొడతాడు. కాసేపటికి ఓ అమ్మాయి వచ్చి తలుపు తీస్తుంది. ఆమె పేరు భవ్యభవ్య : వరుణ్ ? ఏంటి ఇంత పొద్దున్నే వచ్చావు?వరుణ్ : అక్కా ఇవాళ పొద్దున్న వార్త చూసావా?భవ్య : ఏం వార్తా? అని అడిగేలోపు వరుణ్ తన మొబైల్ లొఉన్న వీడియొ ఒకటి భవ్య కి చూపిస్తాడు. అందులొ అర్జున్ యొక్క అరెస్టు మరియు అతనికి పడ్డ 7 సంవత్సరాల శిక్ష గురించి ఉంది.అది చూసి భవ్య ఒక్కసారిగా నిర్ఘాంతపోయి సోఫాలొ చితికిలబడిపోతుంది తరువాత చాలా బాధపడుతూ ఏడుస్తుంది వరుణ్ : బాధ పడకు అక్క. నువ్వు ఎడవకు.భావ్య : (ఏడుస్తూ) రేయ్ వరుణ్ తను అలాంటివాడు కాదురా. అర్జున్ చాలా మంచి వాడు. తను తప్పు చేసి ఉండడు. నీకు తేలీదా చెప్పు?వరుణ్ : అర్జున్ అలాంటివాడు కాదు అని నాకూ తెలుసు