రాక్షస కుక్కలు - 2

రహస్య ప్రేమ — రమ్య అన్వేషణలో వెలుగులోకి వచ్చిన నిజంరమ్య, తన అన్నయ్య రాజుకు న్యాయం చేయాలనే సంకల్పంతో, సోము వ్యవహారాలపై నిశితంగా గమనించడం ప్రారంభించింది. రాజు మరణం వెనుక ఉన్న మాయాజాలం ఆమెను ప్రశ్నలతో నిండిన మార్గంలో నడిపించింది.ఒక రోజు, ఆమె సోమును ఎదుర్కొంది. “నిజం చెప్పు సోము… రాజు మరణానికి కారణంఏమిటి?” అని అడిగింది. కొద్దిసేపు మౌనంగా ఉన్న సోము, చివరకు నిశ్శబ్దాన్ని చీల్చుతూ అన్నాడు — “అసలు విషయం... రాజు  అనమికా ను ప్రేమించాడు. ఆమెను అతను ఎంతో గౌరవంగా, హృదయపూర్వకంగా ప్రేమించాడు. కానీ అదే అనమికాను శివ కూడా ప్రేమిస్తున్నాడు.”ఈ మాటలు రమ్యను కుదిపేశాయి. ఇద్దరు వ్యక్తులు — రాజు, శివ — ఒకే అమ్మాయిని ప్రేమించడం... ఇది కేవలం ప్రేమ తగాదా కాదు. ఇది రాజు జీవితాన్ని మార్చేసిన మలుపు.అనమికా ప్రేమలో ఎవరి పక్షంలో నిలిచింది? శివ ప్రేమ నిజమా లేక వ్యూహమా? రాజు