Part - IXతాను వీరఘాతకుడి కొడుకు ని అని నారాయణ మూర్తి చెప్పగానె వంశి మరియు సిట్ (SIT) ఆఫీసర్ ధనుంజయ్ నవ్వుతున్న నారాయణమూర్తి వంక ఆశ్చర్యంగా అలా చూస్తు ఉండిపోతారు.తరువాత కోంచెంసేపటికి తేరుకొని. అతనిని పరి పరి విధాలు గా ప్రశ్నలు వేశారు ప్రతి దానికి అదే సమాధానం. ఇలా ఒక 4 రోజులు విచారణ కొనసాగింది గాని లాభం లేదు. ఆ తరువాత 5 వ రోజు విచారణ లొ కూడా నారాయణమూర్తి అలాగె చెప్తాడు.(SIT) ధనుంజయ్ : ఏంటి తమాషా గా ఉందా? ఎన్నీ సార్లు అడిగినా అదె సమాధానం చెబుతున్నారు. అయిన ఎప్పుడొ 18వ శతాబ్దం లొ చనిపోయిన వీరఘాతకుడికి మీరు కొడుకా? అంటె ఇప్పుడు మీ వయసు 246 సంవత్సరాల? నమ్మాడానికి మేము ఏమైన పిచ్చివాళ్ళమా?నారాయణమూర్తి : మీరు నమ్మిన నమ్మకపోయిన అదే నిజం. నేను వీరఘాతకుడి కొడుకుని.(SIT) ధనుంజయ్ : నాన్ సెన్స్