ప్రతి రోజూ ఏదో ఒక బాధ్యతతో మన రోజు మొదలవుతుంది. మన గురించి ఆలోచించే సమయం మనకే దొరకదు. మనిషి తనకోసం, కాక పోయినా తనవాళ్ల కోసం ఏదైనా చేస్తూనే ఉంటాడు. ఏదో ఒకటి పొందాలంటే ఇంకేదో వదులుకోవాల్సి వస్తుంది.ఈ బిజీ జీవితంలో మనం ఒక చిన్న విరామం తీసుకోవాలని అనుకున్నా, దానికి కూడా వెసులుబాటు దొరకదు. మధ్యతరగతి జీవితాన్ని గడిపే వారే ఎక్కువ. నెలాఖరుకి ఖర్చులకు కూడా డబ్బులు సరిపోని ఈ వర్గం వారికే నిజంగా తెలుసు — జీవితం అంటే ఏమిటో, ఆశ అంటే ఏమిటో, కల అంటే ఏమిటో.ఒక కల కనబడుతుంది, అది నిజం అవుతుందో లేదో తెలియదు. కానీ ప్రతి రోజూ ఆ కల నిజం కావాలని ఆశిస్తూనే ఉంటాం. బాధ్యతల మధ్య మనం కోల్పోయేది ఈ చిన్నీ చిన్నీ ఆశలే. పెద్దపెద్ద కలల మధ్య, ఈ చిన్నచిన్న కోరికలను మరిచిపోతుంటాం.---అమృత — ఎప్పుడూ గడియారానికి