ఆ రోజు రాత్రి 9 ఏళ్ళ అనిరుద్ కి వీరఘాతకుడి కధ చెప్పి శాంతి నిద్రపుచ్చి తరువాత తాను కూడా నిద్రపోతుంది. కొంచెం సేపటికి ఎవరో ఆ ఇంటి తలుపు కొడతారు. గాఢనిద్ర లొ ఉండడం వల్ల చాలా సేపటికి తనకు మెలకువ వచ్చి లేస్తుంది"ఈ సమయం లొ ఎవరై ఉంటారు?" అనుకుంటుంది శాంతి."శాంతి..... శాంతి ..... నేనూ..... తలుపు తీయ్యు" అని బయట నుంచి పిలుపు వినబడుతుందిఆ గొంతు విని వచ్చింది తన భర్తె అని గ్రహించి వెళ్ళి తలుపు తీస్తుంది. తలుపు తీయగానె ఎదురుగా తన భర్త ఎదొ కంగారు పడుతున్నట్టు కనిపిస్తాడు.శాంతి : మీరా? పని మీద ఎవిరి నొ కలవడానికి బరంపురం వెళ్ళాలి అన్నారు? అప్పుడె వచ్చేసారె.?శాంతి భర్త : ఏమి లేదు ప్రయాణం రద్దు (Cancel) అయ్యిందిశాంతి : ఎందుకని ?శాంతి భర్త : అవన్నీ నీకు ఇప్పుడు చెప్పలేను వదిలెయ్యి.శాంతి : సరే ఎమైన