మౌనం మట్లాడేనే - 7

  • 195
  • 72

ఎపిసోడ్ - 7తిరస్కరణఆ సాయంత్రం… ప్రియా రోడ్డు పక్కన ఉన్న బెంచ్ మీద కూర్చొని, కన్నీళ్లు తుడుచుకుంటూ, ఫోన్‌లో కృష్ ఫోటో చూస్తూ అనుకుంది —“సారీ కృష్… నువ్వు ఏమి చెప్పబోతున్నావో నాకు తెలుసు.నేను కూడా నిన్ను ప్రేమించాను… కానీ ఇప్పడు నీ ప్రేమను అంగీకరించే స్థితిలో లేను. కారణం కూడా నీకు ఇప్పుడే చెప్పలేను.అందుకే… ఒక అబద్ధం చెప్పబోతున్నాను. నేను చేయబోయేది క్షమించు… నా దగ్గర మరో దారి లేదు.”అంతలో ఫోన్ మోగింది — కృష్ కాల్.కృష్: “హే ప్రియా… ఎక్కడున్నావు? ఆల్రెడీ ఏడు అయ్యింది. నేను వెయిట్ చేస్తున్నాను,” అని ఎంతో ఆనందంగా అన్నాడు.ప్రియా: “హా కృష్… వస్తున్నా. పది నిమిషాల్లో అక్కడ ఉంటాను.”స్పాట్‌కి చేరుకున్న వెంటనే, లైట్లు అన్నీ ఆఫ్‌లో ఉన్నాయి.“కృష్!” అని పేరు పిలిచగానే ఒక్కసారిగా లైట్లు వెలిగాయి.అందరూ: “హ్యాపీ బర్త్‌డే ప్రియా!” అని ఒకేసారి అరిచారు.కృష్ దగ్గరికి వచ్చి —కృష్: “హ్యాపీ బర్త్‌డే ప్రియా!