కళింగ రహస్యం - 2

Part - II ఆ సంఝటన జరిగిన కొన్ని రోజుల తరువాత. ఊరి ప్రజలందరు ఒక బంగళా ముందు సమావేశం అయ్యారు. ఆ బంగళాలొంచి తెల్లటి పట్టు పంచె, లాల్చి, వేశుకొని భుజం పై కండువా తొ ఒక మిడి వయసు వ్యక్తి వస్తున్నాడు. అతనిని చూడగానె ఊరి ప్రజలు మరియు గ్రామ పెద్దలందరు కుర్చీలోంచి లేచి నిలబడ్డారు.అతను ఎవరో కాదు. తూర్పు గంగా రాజుల వంశానికి చెందిన వాడు నేటి తరం వారసుడు. రాజా మహేంద్ర వర్మ. రాచరిక పాలన పోయి ప్రజాస్వామ్యం వచ్చిన కూడా అతని తాతలు మరియు తండ్రి లాగె నిత్యం ఆ ఊరి ప్రజల కోసం పాటు పడె వ్యక్తి.రాజకీయాలకు దూరంగా ఉంటాడు. పదవి కాంక్ష లేదు. విదేశాల్లో చదువుకోని కూడా ఆ చదువు తన ఊరి ప్రజలకు ఉపయోగపడాలి అనె ఉద్దేష్యంతొ. దంతపురం లొనె స్థిరపడి ఆ ఊరిని ఎంతగానొ అభివృద్ది చేశాడు. ఉచిత పాఠశాలలు, కళాశాలలు, వైద్యశాలలు కట్టించాడు.ఊరికి