ఎపిసోడ్ – 5గతపు నీడలు[ఫ్లాష్‌బ్యాక్]అదిత్య సర్ "గెట్ అవుట్" అనగానే, ప్రియాకి అసలు ఏమీ అర్థం కాలేదు. కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి.అదిత్య గారు దాసయ్యతో కోపంగా ఇలా అన్నారు –"దాసయ్య, ఈ అమ్మాయిని బయటకి వెళ్ళమని చెప్పు.వెళ్లకపోతే నువ్వే చెయ్యి పట్టుకుని బయటకి వెళ్లగొట్టే!" అని చెప్పి రూమ్‌కి వెళ్లిపోయారు.దాసయ్య ప్రియాతో –"అమ్మ, వెళ్ళండమ్మ..." అని చెప్పి బయటకి పంపించి తలుపు మూసేస్తాడు.ప్రియా కన్నీళ్లు తుడుచుకుంటూ తనలో తానే అనుకుంటుంది –"ఈరోజు మీరు ఎంత కోపంగా ఉన్నా, ఏం జరిగిందో తెలుసుకోవాల్సిందే అంకుల్... నేను చెప్పకుండా ఊరుకోను."అని అనుకుంటూ ఉండగానే కృష్ ఫోన్ కాల్ వస్తుంది...ప్రియా: "హై కృష్, చెప్పు."కృష్ (నవ్వుతూ): "ప్రియా... నాకు ఒక విషయం చెప్పాలనుంది."ప్రియా (గట్టిగా ఊపిరి పీల్చుకుని): "నాకు కూడా నీకు ఒక విషయం చెప్పాలనుంది కృష్..." అని చెప్పగానే,కృష్: నవ్వుతూ – "అలాగైతే, సాయంత్రం మన రిగులర్ స్పాట్ లో కలుద్దాం." అని చెబుతాడు.ప్రియా: "హ్మ్... ఓకే, బై." అని ఫోన్