నీరాజనం

  • 126
  • 60

                        నీరాజనం  అహం   బీచ్   ప్రేమ మాధుర్యం   ఏకాకి జీవితం గమ్యం***రోజూ సాయంత్రం రామకృష్ణా బీచ్ కు వెళ్ళి…అగాధం లోంచి పడిలేస్తూ ఒడ్డుకు చేరాలని విక్రమార్కుడి సంతతిలా పట్టు విడవకుండా ఆరాటపడే కడలి తరంగాలను ఆసక్తిగా తిలకిస్తూ, సముద్రుడు నిశాకాంత ఒడిలో ఒరిగిపోయేంతవరకు గడపి రావడం అలవాటు నాకు. ఆ రోజూ అలాగే బీచ్ లో కూర్చున్నాను, చల్లటి గాలి సేదదీర్చుతూంటే. అప్పుడే పడింది నా దృష్టి విరజ మీద. అక్కడకు ఎప్పుడు వచ్చిందో…ఎందుకు వచ్చిందో!పరీక్షగా చూసాను ఆమె వంక… మునుపటికంటె మరింతగా నిగ్గుదేరినట్లనిపించింది ఆమె అందం. అణువణువునా లావణ్యం ఉట్టిపడుతోంది. పక్కనున్న యువకుడు ఆమె భర్తో, ప్రియుడో…అతని పైకి వాలిపోయి కూర్చుంది. గలగల నవ్వుతూ అతనితో మాట్లాడుతోంది. ఆమె నన్ను చూసినట్టు లేదు.రెండేళ్ళ తరువాత హఠాత్తుగా విరజను అక్కడ చూసేసరికి నా మనసు గొప్ప భావోద్రేకానికి గురయింది. నిర్మల తటాకంలో రాయి