నా ఆత్మ కథ

  • 222
  • 81

ఆత్మలు ఉన్నాయో లేవో తెలియాలి అంటే నేను ఆత్మగా మారితే కానీ తెలియదు ఏమో కాబట్టి ఒకవేళ ఆత్మలు ఉండి అవి మన చుట్టూనే తిరుగుతుంటే ఎలా ఉంటుందో ఒక కథ చెబుతాను.కథ పేరు "నా ఆత్మ కథ" మొదటి భాగంక్లూ నెంబర్ 1: ఫ్లాట్ డోర్ లాక్ చేసాను.లిఫ్ట్ బటన్ నొక్కాను.లిఫ్ట్ పని చేయలేదు.ఈ రోజు నేను శృతిని కలవడానికి వెళ్తున్నాను.ఇది నాకు లైఫ్ లో చాలా ముఖ్యమయిన రోజు.శృతి అనే పేరు తలుచుకుంటేనే నా పెదవులు విచ్చుకుంటాయి.నా మనసులో జిల్ అన్నట్లు ఉంటుంది.అలా శృతి గురించి ఆలోచిస్తూ మెట్లు దిగి కిందకి వచ్చాను.బైక్ సెల్ఫ్ స్టార్ట్ బటన్ నొక్కాను.క్లూ నెంబర్ 2: బైక్ స్టార్ట్ అవ్వలేదు.చాలా సేపు కిక్ కొట్టి ప్రయత్నించాక విసిగి వేసారి అటూ ఇటూ చూశాను.మా గేట్ బయట ఒక ఆటో ఆగి ఉంది.ఇంతలో నా ఫోన్ రింగ్ అయింది. ఇంకా స్టార్ట్ అవలేదా? అని