సీసా తో జీవితం మన జీవితానికి "సీసాకి " విడదీయరాని బంధం ఉంది. నిత్యం అనేకసార్లు ఈ పదాన్ని ఉపయోగిస్తుంటాo. మన ఇంట్లో ఎక్కడ చూసినా ఈ సీసాలు కనబడుతుంటాయి. సీసా అనే పదాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. వంటింట్లో నూనె సీసాలు, గూట్లో కొబ్బరి నూనె సీసాలు రిఫ్రిజిరేటర్ లో మంచినీళ్ల సీసాలు ఇంకాస్త ముందుకు వెళ్తే ఆ సీసాలు , హాల్లో అందానికి ఖాళీ సీసాలో వేసిన మొక్కలు, చెత్త పుట్టలో వాడి పడేసిన సీసాలు వాటి పేరు ఎందుకు ? ఇలా ఎక్కడపడితే అక్కడ కాళ్లకు తగులుతూ సీసాలు కనబడుతూనే ఉంటాయి.రంగురంగుల సీసాలు ఒకరికి ప్రాణదాత అయితే మరొకరికి సరదా తీర్చేవి, ఇంకొకరికి పట్టెడు అన్నం పెట్టేవిగా ఉంటాయి. మాతృత్వం మరిచిపోయిన అమ్మ, లేదంటే అమ్మ పాలు రుచి చూసే అదృష్టం లేని పసిబిడ్డకి మరో అమ్మ ఆ పాలసీసా. వేళకి కడుపు నింపుతుంది. అప్పటివరకు గుక్క పట్టి ఏడుస్తున్న