Episode 1:విద్యుత్ దీపాల కాంతిలో మెరుస్తున్న విశాఖపట్నంలోని అత్యంత ఖరీదైన కళ్యాణ మండపం లో జనం ఒకరిని ఒకరు పలకరించుకుంటూ, కేటరింగ్ వాళ్ళు అందిస్తున్న కాఫీ, టీ లు తాగుతూ, ఇంద్ర భవనాన్నితలపించేలా ఉన్న కళ్యాణ మండపం దగ్గరకి ఒక car వచ్చి ఆగుతుంది .దానిలో నుంచి అశోక్ బయటకు దిగి, వేగంగా జన సందోహాన్ని తప్పించుకుంటూ కళ్యాణ మండపంలోకి వెళ్ళాడు.అర్జున్.. పిన్ని కౌసల్య గారు,“కదలకు రా”అంటూ అర్జున్ కి పెళ్ళి బొట్టు పెడుతున్న సమయంలో, కౌసల్య గారి భర్త ఆనందరావు, కుమారుడు అశోక్ ఆ గదిలోకి వస్తారు.అర్జున్ కదలకుండా అశోక్ వైపు చూసి —"ఏరా, అను వాళ్ళు వచ్చారా?" అన్నాడు… చిన్న చిరునవ్వు తో , అశోక్ , ఆనందరావు బాధగా ఒకరి ముఖం చూసుకుని అర్జున్ వైపు బాధగా చూస్తూ ఉంటారు. అర్జున్ doubt గా చూసి,"ఏమైంది బాబాయ్?"అని అడగడం తో పెళ్లి బొట్టు పెడుతున్న కౌసల్య ఆగి doubt