మానవత్వంఇవాళ పొద్దున్నే లేచి ఎవరు మొహం చూసానో! ఒక్క బేరం రాలేదు."పోనీ ఇంటికి వెళ్ళిపోదాం" అనుకుంటే, ఇంటి దగ్గర ఎదురుచూసే అప్పుల వాళ్లకి, ఇంటి యజమానికి ఏం సమాధానం చెప్పాలి! అని పోచయ్య తనలో తాను మధనపడుతూ, ఏం చేయాలో తోచక, ఆటో స్పీడ్‌గా డ్రైవ్ చేస్తూ, సందు తిరిగేటప్పటికీ...పెద్ద చప్పుడు, "అమ్మా!" అని గట్టిగా కేక వినబడింది.ఏం జరిగిందో చూసే లోపల చుట్టూ జనం గుమిగూడారు.రోడ్డుమీద సుమారు నలభై ఏళ్ళు ఉంటాయేమో అనిపించే వ్యక్తి, రక్తపు మడుగులో పడి ఉన్నాడు. పక్కనే మోటార్‌సైకిల్, హెల్మెట్ పడి ఉంది. ఎవరో "యాక్సిడెంట్!" అని గట్టిగా అరుస్తున్నారు.ఒక క్షణం పోచయ్యకి ఒళ్లంతా చెమటలు పట్టేశాయి."ఇదేమిటిరా భగవంతుడా! ఇదొక ప్రాబ్లం. ఈ రోజంతా ఇలా ఉంది ఏంటి? పైసా సంపాదన లేదు, గాని మళ్లీ కొత్త సమస్య వచ్చి పడింది!""ఇప్పుడు ఆటో దిగితే జనం గట్టిగా కొడతారు, తిడతారు, పోలీస్ కేసు పెడతారు. ఒకసారి