ఎపిసోడ్ – 4ఎదురుగాలిలో నిలిచిన నిశ్శబ్దంఅలా సముద్రపు ఒడ్డులో కూచొని మాటలు కొనసాగిస్తున్నారు...[ ఫ్లాష్‌బ్యాక్ ]ప్రేమ పావురం కాలాన్ని మించి ఎగురుతోంది…తనవైపు మళ్లే ప్రతి సరిహద్దును దాటేస్తోంది…ఇద్దరు ఒకరు గా మారరు కానీ, తెలియనిదేదో గాలి కమ్మేస్తోంది...తెలియక ప్రేమ మయకంలో మునిగారు ఇద్దరూ…ఏ గాలి, ఏ తుఫాను వచ్చినా “చేయి వదలము” అనుకున్నారు ఇద్దరూ…ఇంత లోతుగా ప్రేమించుకున్నా —ఇంకా ఆ మూడు ముక్కలు మాత్రం చెప్పుకో లేదు ఇద్దరు..రానేవచ్చింది ఎదురు చూస్తున్న రోజు,ఒక మాట చెప్పాలనుకున్న రోజు…ఆ మూడుముక్కల్ని మూడుముళ్లుగా మార్చేద్దాం అనుకున్నారు ఇద్దరూ…ఆ రోజు ప్రియ బర్త్‌డే —క్రిష్ ఎన్నో రోజులు గా ఎదురు చూస్తున్న రోజు వచ్చింది...క్రిష్ – స్వాతి తో మాటల్లో:క్రిష్: “స్వాతి, ఈ రోజు ప్రియ బర్త్‌డే. తనకి సర్‌ప్రైజ్ పార్టీ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాను…ఈరోజు I will definitely say those 3 magical words to her!” అని నవ్వుతూ అన్నాడు.స్వాతి: “చెప్పు, చెప్పు! అక్కడంతా మిమ్మల్ని లవర్స్‌గా