అంతం కాదు - 5

  • 201

సీన్ 3: అక్షర అంతరంగం)ఆ వెంటనే శ్వేత, అక్షర ఇద్దరూ వీడ్కోలు చెప్పి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళారు. అక్షర ఆటో ఎక్కి మళ్ళీ సుమిత్ ఉన్న రూమ్‌కి వస్తుంది. అప్పటికే రుద్ర వచ్చి అలా పడుకొని ఉంటాడు.రుద్రను చూస్తున్న అక్షర ఒక్కసారిగా, "ఏంటి? ఈ రోజు ఇంత అందంగా కనిపిస్తున్నాడు? లేదా భూమ్మీదకి వచ్చి నేను కూడా ఇలాగే అయిపోయాను? నా సంగతి ఏంటిది? నా నాన్న ఎక్కడున్నాడో తెలీదు, నేను ఎలా వెళ్ళాలో తెలియదు" అని అనుకుంటూ రుద్రను చూస్తూ అలా బెడ్ మీదకి వెళ్ళింది.(సీన్ 4: ఘటోత్కచుడి మేల్కొలుపు)అదే టైంలో, ఎక్కడో తెలియని ప్లేస్‌లో ఒక పసుపు రంగు స్పేస్‌షిప్ ఉంటుంది. త్రిశూలానికి ఉన్న మూడు కొమ్ముల లాంటివి అతికించబడ్డాయి, కానీ ఒకటి మిస్ అయ్యింది. దాని కోసం కొత్తగా ఒకటి రెడీ చేస్తున్నారు.అప్పటికి దానిలో ఉన్న ఘటోత్కచుడు మేల్కొన్నాడు. చుట్టూ ఉన్న సైనికులు, "సార్, మనకు