చేతి వ్రాత

  • 150

చేతి వ్రాత "ఏవండీ ఆ గూట్లో ఉన్న డైరీలు దుమ్ము కొట్టుకు పోతున్నాయి. బయట పడేస్తాను. ప్రతిసారి దులుపుకోవడం కష్టంగా ఉంది అంది సుధాకర్ భార్య రమ్య ఇల్లు దులుపుతూ." నేను వాటిని ప్రతి ఆదివారం చదువుకుంటున్నాను గా! ఎందుకు పడేయడం? నీకు అంత కష్టంగా ఉంటే నేను దుమ్ము దులుపుకుంటాను. నువ్వు అక్కడ వదిలేసేయ్ అన్నాడు కోపంగా సుధాకర్. " ప్రతిసారి ఇదే మాట చెబుతున్నారు. ఒకసారి కూడా దులిపిన పాపాన పోలేదు అoది రమ్య." సరేలే అలా వదిలేసేయ్. తర్వాత చూద్దాం అన్నాడు చిరాకుగా సుధాకర్ .రమ్య ఏమీ చేయలేక విసురుగా వంటింట్లోకి వెళ్లిపోయింది."ఏమిటో రమ్య అర్థం చేసుకోదు. ఎన్నో ఏళ్ల నుంచి ప్రాణప్రదంగా దాచుకున్న డైరీ లని పడేస్తాను అంటుంది ఏమిటి ? దాని విలువ తనకేం తెలుసు! కొన్ని కోట్లు ఖర్చుపెట్టిన అలాంటి వాటిని మళ్లీ తీసుకురాలేము అని సుధాకర్ అనుకుంటూ ఒకసారి గతంలోకి వెళ్లిపోయాడు. రామయ్య రవణమ్మల ఏకైక