మనసు లోతులో...

దిక్కు తూచే మనస్సుమనసుంటే మార్గముంటుంది నిజమే,కానీ ఆ మనస్సే దిక్కు తూచక ఆలోచిస్తేమార్గం ఎటు సాగాలి,మాటలు ఎ దారి చూపించాలి?గమ్యం పయనాన్ని మార్చెనాలేక  పయనం గమ్యాన్ని తెల్చెనాఆ నింగి నీ వైపు మళ్ళెనాఎటు చేరాలో నిన్నే అడిగెనామెదలు చెప్పెను మనసుకిశాంతించు దారి దొరికెనుఅలజడిని అపమానీ చెప్పెనుమార్గమున్నది నిజమే మనస్సుదిక్కు తొచక ఆలోచనలో మునిగెను...----కలలు కన్నులపైనేకల అందరికి ఉంటుంది,దానిని నిజం చేసుకునే హక్కు కూడాఅందరికి ఉంటుంది...ఆపదలు ఒక అడుగును ఆపేస్తే,మన ఆలోచనలు ఇంకో పది అడుగుల్ని అపేస్తుంది..మార్పు రావాల్సింది మనతోనే కదా,మనలోనే కదా...పగటి కలలు ఊహ మాత్రమేనా?లేక ఊహని దాటి ఇంకొక అర్థం ఉందనిపించెనా?ఆలోచించి చూడు, సమాధానం దొరకొచ్చు.నీ కల నీది, నీ సాధన నీదే,ఇంకోసారి కన్నుల ముందు పెట్టి చూడు.ఈసారి కన్నులు మూసుకుని కాదు,కన్నులు తెరిచి చూడు.కల అందరికి ఉంటుంది,దానిని నిజం చేసుకునే హక్కు కూడాఅందరికి ఉంటుంది...----ఆకాశం మనదేకురిసే వర్షంలో తడవడంఅందరికీ ఇష్టమేచీకటిని దాటి వెలుగులో చేరడంకొందరికి కష్టమే...ఎప్పుడైతే చీకటి మన మనసునుమబ్బులా