1ఎగిరే ఆకాశం...ఎగురుతున్నది ఇది — నా ఎగిరే ఆకాంక్ష,నా కలల గొప్పతనానికి చిహ్నం ఇది,దాటాల్సినది నదులు, సముద్రాలు ఎన్నో!ఎక్కడెక్కడో అలలు కొట్టుకుంటున్నా,వేల పాళెళ్లను ఢీకొన్నా,ఒక్క రాయి గీసిన గీతలకేనా రెక్కలు విరిగిపోతాయా?గమ్యమే నా కోరిక అయిపోయింది,కానీ నా లోకమే దాన్ని దాచేస్తుందా?ఏమిటీ — ఈ విధి నన్నెందుకు అలుగుతోందో?ఎప్పుడైనా నేను ఆ ఆకాశాన్ని తాకగలగనా?చంద్రుడి కాంతిని మబ్బులు దాచినప్పటికీపొలిరే వెన్నెలలో వేల నక్షత్రాలు కనిపిస్తాయి.అయితే నా కలలు ఆ మబ్బుల వెనకేఅంతరించిపోతాయా?లేదా ఆ నక్షత్రాల్లా ఆకాశాన్నే తాకుతాయా?ఇది నా ప్రయాణం,నా స్వప్నాల గౌరవాన్ని మోస్తున్నఒక విలక్షణమైన ఎగిరే ఆకాశం!---2 పంజరం..చిన్న పిట్ట చిక్కుకుందిఒక మూసివేసిన పంజరంలోఆకాశాన్ని చూపేదెవరుఆ స్వేచ్ఛ గల గాలిలో?ఒక్క తాళం తీయడానికిఒక గొంగళి మాత్రమే అవసరంఅది ఎక్కడ వేతకాలి అనే ఆలోచనలోనే ఆగిపోయింది ఆమె కళ్ళు తిరుగుతున్నాయిఇక్కడ నుండి అక్కడ, అక్కడ నుండి ఇక్కడతలచి తలచి అయిపోయిందిగొంగళి దొరుకుతుందా ఎక్కడ?కానీ ఆమెకి తెలియదేఆ పంజరానికే తాళం లేదు అని ఆమె రెక్కలే చాలు బయటికి రావడానికి