తోటలో పెళ్లి

  • 381
  • 1
  • 114

తోటలో పెళ్లిమధ్యాహ్నం మూడు గంటలు అయింది. గదిలో మంచం మీద పడుకున్న ఊర్మిళ కి "పోస్ట్ "అనే కేక వినపడింది. ఉత్తరాలు రాయడం తగ్గిపోయిన ఈ రోజుల్లో ఊర్మిళ ఆ కేక కొత్తగా వినపడింది. వెంటనే లేచి వీధిలోకి వచ్చేటప్పటికి పోస్ట్ మాన్ ఏదో ఒక శుభలేఖ చేతిలో పెట్టి వెళ్లిపోయాడు. అసలే వైశాఖమాసం పెళ్ళిలో ముహూర్తాలన్నీ ఈ నెలలోనే. ఎవరిది అబ్బా! ఈ శుభలేఖ అనుకుని ఫ్రమ్ అడ్రస్ చూస్తే భర్త రామారావు ఫ్రెండ్ రాజిరెడ్డి అయినవిల్లి నుంచి పంపించిన శుభలేఖ. శుభలేఖ తెరిచి చూసిన వెంటనే చాలా ఆశ్చర్యం అనిపించింది ఊర్మిళకి. "తోటలో పెళ్లికి ఆహ్వానం" అని రాశారు హెడ్డింగ్. వరుడు పేరు, వధువు పేరు, ముహూర్త సమయం, తేదీ అన్ని మామూలే క్రింద మటుకు ఆహ్వానించే వాళ్ళ పేర్లు ఉన్నాయి. రాజిరెడ్డి ఆ ఊర్లో బాగా మోతుబరి రైతు. కొబ్బరి తోటలో వరి పొలాలు బాగా ఉన్నవాడు. పైగా సొంత వ్యవసాయమే చేస్తాడు.ఎన్నోసార్లు