కలికితుRAWయి

  • 414
  • 1
  • 141

RAW Episode-1 Voice : అది భారత గూఢచర్య వ్యవస్థలో అతి ముఖ్యమైన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్- RAW సభ్యులు సమావేశం అయిన ఒక గొప్ప వేదిక. ఆధునిక సొగసులతో కూడిన రంగు రంగుల విద్యుద్దీప కాంతులతో ప్రాంగణం అంతా ధగ ధగ మెరిసిపోతోంది. సభకు హాజరైన విశిష్ట అతిధులు అందరు జంటలు జంటలుగా, గుంపులు గుంపులుగా నిలబడి ఎవరికి నచ్చిన డ్రింకులు వారు సిప్ చేస్తూ గాసిపింగ్ లో మునిగి తేలుతున్నారు. ఇంతలో ప్రవల్లిక పరమేశ్వరన్ మైక్ లో.. ప్రవల్లిక : " లేడీస్ అండ్ జెంటిల్మెన్..KINDLY pay attention. this program about begin in few seconds." వాయిస్: అని వినయంగా పలకరించి అందరినీ స్పృహ లోకి తెచ్చిన ప్రవల్లిక గొంతు ఆ సభా ప్రాంగణం అంతా ప్రతిధ్వనిం చింది. కొద్ది సేపటికే ..అక్కడి కోలాహలం అంతా సద్దుమణిగి ..నిశ్శబ్దం ఆవరించింది. ప్రవల్లిక కంటిన్యూ చేస్తూ