మౌనం మట్లాడేనే - 2

  • 483
  • 156

ఎపిసోడ్ – 2 ["విరహం తడిచిన తీరంలో..."]“హృదయాల లోతులను పంచుకునేందుకు ముందుకొస్తున్నారు...”కృష్ (ఆనందంతో):"అయ్యో! అంటే నువ్వే నన్ను ముందుగా చూసావా? నేను నిన్ను ప్రేమించే ముందు నువ్వే నన్ను ప్రేమించావా?"ప్రియా చిరునవ్వుతో కృష్ వైపు చూసింది. ఆమె కళ్లలో తడిగా పరవశం మెరిసింది.ప్రియా:"ఇష్టమంతే... ఆ రోజు తర్వాత నిన్న మళ్లీ ఎలా కలవాలో అనుకుంటుంటే, అదృష్టంగా ఆఫీసులోనే చూశాను. నేను ఇంటర్న్‌గా జాయిన్ అయిన మొదటి రోజు నువ్వు ఇండక్షన్‌కి వచ్చావు.ఆ రోజు నిన్నే చూస్తూ ఉన్నాను… తెలుసా?నెక్స్ట్ డే నువ్వు ఏదో టెన్షన్‌తో బయటకు వెళ్లిపోయావు. బీచ్‌లో నన్ను చూసావన్నావు కదా... నిజం చెప్పాలంటే, నీవు చూడాలనే వచ్చాను.రెండు గంటలు పట్టింది రెడీ అవ్వడానికి… ఫస్ట్ టైమ్ చీర కట్టుకున్నాను."కృష్ కొంచెం ఆశ్చర్యంతో, చేతులు జేబులో పెట్టుకుని చిన్న నవ్వుతో తల ఊపాడు.ప్రియా:"తరువాత నువ్వు బెంగళూరు వెళ్లిపోయావని స్వాతి చెప్పింది. నా ఇష్టాని నేను అక్కడే ఆపుకు నుంటే బాగుండేది.