అది నాకు ఇష్టం లేదు."అమ్మా ! ఆకలేస్తుంది అన్నం పెట్టవే! అని అడుగుతున్న పదేళ్ల కొడుకు రాఘవని ఉండరా ఇంకా నాలుగు పేపర్లే ఉన్నాయి అవి కూడా దిద్దేసి పెడతాను. ఒక పని అయిపోతుంది. లేదంటే పేపర్లో దిద్దాలంటే బద్ధకం వస్తోంది రా! నీకు ఆకలి కాదురా! వెధవా!సెలవులు కదా ఏమి తోచట్లేదు అనుకుంటాను. టిఫిన్ తిని రెండు గంటలు కూడా అవలేదు అoటు కొడుకుకి సమాధానం ఇచ్చి తెలుగు పేపర్ లో దిద్దడంలో మునిగిపోయింది ప్రత్యూష.ప్రత్యూష ఆ ఊరిలో పేరు మోసిన కాన్వెంట్లో తెలుగు టీచర్ గా పని చేస్తూ ఉంటుంది. అది అసలే ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్. ఇంకేముంది తెలుగు పేపర్ దిద్దడం అంటే చాలా ఈజీ. కారణం ఏంటంటే తెలుగు అంటే ఇంగ్లీష్ మీడియం పిల్లలకి చాలా కష్టమైన సబ్జెక్టు అంటారు. అందుకని తప్పులు ఎక్కువగా రాస్తారు. పిల్లలు కూడా ఏదో పాస్ మార్కుల కోసం ప్రయత్నం చేస్తున్నారు