భయానక మర్రిచెట్టు దెయ్యం

  • 915
  • 306

 అపోహ చెట్టు నింద "ఆ మర్రిచెట్టు దగ్గరకు రాత్రి పూట ఎప్పుడూ వెళ్లకు ఎంతవరకూ సుమారు వందమందిని బలిగొంది ఆ చెట్టు" అన్నాడు వీర్రాజు"చే ఊర్కో మర్రి చెట్టు మనుషుల్ని బలిగొనడమేంటి నీ మూఢ నమ్మకం గానీ ...నీకీ మద్య మరీ చాదస్తం ఎక్కువైపోతుంది" అన్నాడు పోతురాజు"సరే నీ ఇష్టం నేను చెప్పవలిసింది చెప్పాను తరువాత నీ ఇష్టం, కావాలంటే ఈ లిస్ట్ చూడు" ఆ ఊర్లో బెర్రీ బెకం జబ్బుతో గడిచిన పదేళ్లలో చనిపోయిన వారి పేర్లు చెప్పాడు వీర్రాజు."ఓర్నీ అదేదో వింత జబ్బు వచ్చి చనిపోయిన వారి పేర్లు చెప్పి అది మర్రి చెట్టు మాయ అని చెబుతావు ఏంటి? నిజంగా అక్కడ ఏమైనా భూత బేతాల పిశాచాలు ఉంటే మనుషులు అక్కడే చనిపోవాలి కదా ఊర్లోకొచ్చి కొన్నాళ్ళు జబ్బుతో బాధపడి చావడం ఏంటి! అందులో మర్రిచెట్టు భూతాలకు కలిసొచ్చిందేమిటి?" వెటకారంగా నవ్వుతూ అన్నాడు పోతురాజు"అయితే నీ ఖర్మ నీకు