అన్నదానం

  • 600
  • 1
  • 195

అన్నదానం.శీతాకాలం ఉదయం నాలుగు గంటలు అయింది. ఓ పక్క చలి వణికిస్తున్న రిక్షాలో ముడుచుకుని కూర్చుని బేరాలు కోసం ఎదురుచూస్తున్నాడు నూకరాజు. "ఈ ఆటోలు వచ్చి రిక్షా వాళ్ళ కడుపు కొట్టేసాయి. రోజు ఈపాటికి విజయవాడ ప్యాసింజర్ బేరాలు దొరికేవి. ఇప్పటికే రెండు పూటలా అన్నం తినడానికి సంసారం పోషించుకోవడానికి ఆదాయం సరిపోవడం లేదు ఇక ముందు ఎలా ఉంటుందో ! అనుకుంటూ ఆ చీకట్లో అలా ఎదురు చూడసాగాడు. ఇంతలో ఒక జంట భుజాన ఒక బ్యాగ్ తగిలించుకొని బ్యాటరీ లైట్ వెలుగులో నడుచుకుంటూ వచ్చి రిక్షా ముందు ఆగారు. "రైల్వే స్టేషన్ కి ఎంత తీసుకుంటావు అని అడిగారు. 20 రూపాయలు అండి. అమ్మో 20 రూపాయలా! ఆటో అయితే ఐదు రూపాయలే కదా !అంటూ బేరమాడుతూ నిల్చున్నారు. చివరికి 15రూపాయలకి బేరం కుదుర్చుకుని ఇద్దరూ ఎక్కి కూర్చున్నారు. నూకరాజు నెమ్మదిగా రిక్షా తొక్కుకుంటూ వెళ్తున్నాడు. బాబు కొంచెం త్వరగా